ప్రకటన 1.2 వ్యాసరచనల పోటీ
తెలుగు భాషోద్యమ సమాఖ్య వారి
వ్యాసరచన పోటీ - 2020
అంశాలు :
1. తెలుగు భాష
2. తెలుగు చరిత్ర
3. తెలుగు సంస్కృతి
నిబంధనలు:
1. వ్యాసం తెలుగులోనే ఉండాలి, వీలైనంత తక్కువ సంస్కృత-ఆంగ్ల పదాలు
ఉండేలా చూడండి. వ్యాసం నిడివి 1600 నుండి 2000 పదాల మధ్య ఉండాలి.
2. ఈ పోటీలో అందరూ పాల్గొనవచ్చు.
3. వ్యాసాన్ని తెలుగు యూనికోడ్ లో టైప్ చేసి, మైక్రోసాఫ్ట్ వర్డ్ లేదా లిబ్రెఆఫీస్ లేదా
గూగుల్ డాక్స్ ద్వారా రూపొందించాలి. అక్షరదోషాలు, వ్యాకరణ దోషాలు ఉండకూడదు.
4. వ్యాసానికి సరిపోయే బొమ్మలను, చిత్రాలను చేర్చవచ్చు, తప్పనిసరి కాదు. సాధ్యమైనంత
వరకూ సాంకేతిక పదాలను తెలుగులో అనువదించి, ఆంగ్ల పదాన్ని పక్కనే బ్రాకెట్లో రాయాలి.
5. వ్యాసం మొదటలోనే వ్యాసకర్త పేరు, చిరునామా, ఈమెయిల్ చిరునామా, ఫోన్ నంబర్ జత చేయాలి.
6. వ్యాసం రాసేందుకు వాడిన మూలాలు, వనరులు, పత్రికలు, పుస్తకాల వివరాలు వ్యాసం చివరన,
కుదిరితే వ్యాసంలో పాదసూచికగా చేర్చాలి.
7. వ్యాసం వ్యాసకర్త సొంత రచన అని, ఇంతకు ముందు మరెక్కడా ప్రచురించలేదని వ్యాసకర్త హామీ ఇవ్వాలి.
వ్యాసాన్ని రచయిత CC-BY 4.0 లైసెన్స్ ద్వారా విడుదల చేయాలి.
8. మీ వ్యాసాలను నమోదు ఫారం ద్వారా ఈ లంకెలో నింపాలి.
9. పోటీకి సంబంధించిన ఉత్తర-ప్రత్యుత్తరాల కోసం tebhasapoti@gmail.com ఈ-వేగు ద్వారా
మాత్రమే సంప్రదించాలి. నిర్వాహకులను, పోటీకి సంబంధించిన వ్యక్తులను వ్యక్తిగతంగా సంప్రదించవద్దు.
10. పోటీ మొదలు తేదీ : 29 ఆగస్టు, 2020
వ్యాసాలు సమర్పించేందుకు ఆఖరు తేదీ : 1 జనవరి 2021 మధ్యాహ్నం 12 గం॥ లకు.
11. అందిన అన్ని వ్యాసాలలో, అర్హతుకు సరిపోయే వాటిలో వంద వ్యాసాలను ఎంపిక చేసి.
ఒక్కో వ్యాసానికి అక్షరాలా వెయ్యి రూపాయల బహుమతిని అందచేస్తాము.
12. ఎంపిక అయిన వ్యాసాలు అమ్మనుడి పత్రిక ద్వారా వెలువరిస్తాం. వ్యాసాల ఎంపికలో
న్యాయనిర్ణేతలదే అంతిమ నిర్ణయం, ఇందుకు ఎలాంటి వివాదాలకు చోటు లేదు.
నమోదు చేసుకునేందుకు ఫారము : https://forms.gle/zWRdGfk7sCaQTC4n8
పదాంతం
ReplyDelete