ప్రకటన 1.1 మొబైల్ యాప్ పోటీ
తెలుగు భాషోద్యమ సమాఖ్య వారి మొబైల్ యాపు పోటీ - 2020 మొబైల్ యాప్ పోటీలో పాల్గొనాలనుకునేవారు మూడు విధాలుగా మొబైల్ యాప్‌లను రూపొందించవచ్చు - 1. యాండ్రాయిడ్ - గూగుల్ ప్లే స్టోర్ లోకి నేరుగా ఎగుమతిచేయాలి 2. ఐఓఎస్ - యాపిల్ యాప్‌స్టోర్ లోకి నేరుగా ఎగుమతిచేయాలి 3. వెబ్ యాప్ ను- ఒక నిర్ణీత గూగుల్ ఫారం ద్వారా అందించవచ్చు. నిబంధనలు: 1. యాప్ తెలుగులోనే ఉండాలి. తెలుగు ఆటలు, పాటలు, సాహిత్యం, తెలుగు భాష, సంస్కృతి, చరిత్రలను తెలిపే విధంగా ఆటలను రూపొందించవచ్చు. లేదా తెలుగు భాషను నేర్పే యాప్‍లు కావచ్చు, తెలుగులో ఛందస్సు, సంధులు, భాషాభాగాలను గుర్తించే యాప్ కావచ్చు, లేదా తెలుగు దిద్దరి (స్పెల్ చెకర్), వ్యాకరణ నిర్దుష్టతను తెలిపే యాప్‌లు, తెలుగు సాహిత్య అవగాహనను పెంచే కావచ్చు. 2. ఈ పోటీలో అందరూ పాల్గొనవచ్చు. 3. ఒకరే రూపొందించవచ్చు లేదా జట్టుగా పాల్గొని రూపొందించవచ్చు. బహుమతి రూపొందించిన వ్యక్తికి లేదా జట్టుకి అందిస్తాం. పేరు, చిరునామా, ఈమెయిల్ చిరునామా, ఫోన్ నంబర్ నమోదు పత్రంలో చేర్చాలి. 4. ఈ పోటీకి సమర్పించే మొబైల్/వెబ్ యాప్, పోటీ తరువాత అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచాలి. 5. మొబైల్ ...